గూగుల్‌లో 10 శాతం మంది మేనేజిరియల్ హోదా ఉద్యోగులపై వేటు

  • గతేడాది 12 వేల మందికి ఉద్వాసన పలికిన గూగుల్
  • మేనేజిరియల్ హోదాల్లో ఉన్నవారిపై ఇప్పుడు వేటు
  • పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగానే కోతలన్న సుందర్ పిచాయ్
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో 98 వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు
టెక్ కంపెనీల్లో కోతలు మళ్లీ మొదలయ్యాయి. ఉద్యోగులను ఎడాపెడా ఇంటికి పంపుతున్నాయి. గతేడాది 12 వేలమందికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపిన సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు మరో 10 శాతం మందిపై వేటు వేసేందుకు రెడీ అయింది. రెండేళ్లుగా చేపడుతున్న పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ సీఈవో సందర్ పిచాయ్ తెలిపారు. మేనేజిరియల్ హోదాల్లో ఉన్న వారిపై ఈ ప్రభావం పడనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)  సంస్థల నుంచి పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, ఫలితంగా ఉద్యోగులపై వేటు తప్పడం లేదని పేర్కొంది. కాగా, ఈ ఏడాది ద్వితీయార్థంలో 333 టెక్ కంపెనీలు 98 వేలమందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఒక్క మే నెలలోనే 39 కంపెనీలు పదివేల మందిని ఇంటికి పంపాయి.


More Telugu News