మాదాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

  • ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ భ‌వ‌నంలో భారీగా చెల‌రేగిన‌ మంట‌లు 
  • స‌త్వ ఎలిక్విర్ భ‌వ‌నంలోని ఐదో అంత‌స్తులో ఘ‌ట‌న
  • మంటలార్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అగ్నిమాప‌క సిబ్బంది  
హైద‌రాబాద్‌ మాదాపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున‌ భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ భ‌వ‌నంలో భారీగా మంట‌లు చెల‌రేగాయి. దాంతో స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది రెండు ఫైరింజ‌న్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంటలార్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌త్వ ఎలిక్విర్ భ‌వ‌నంలోని ఐదో అంత‌స్తులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

ఇక అగ్ని ప్ర‌మాదానికి సిలిండ‌ర్లు పేల‌డంతో భ‌వ‌నం పాక్షికంగా దెబ్బతింది. ఈ అగ్ని ప్ర‌మ‌దంతో స‌మీపంలో ఉన్న సాఫ్ట్ కంపెనీల ఉద్యోగుల‌ను అధికారులు అక్క‌డి నుంచి పంపించివేశారు. కాగా, విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


More Telugu News