అదొక యాక్సిడెంట్... నేను మాట్లాడుతున్నది ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు: అల్లు అర్జున్
- అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ
- అసెంబ్లీలో ఇవాళ అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి
- మంత్రులది కూడా అదే బాణీ
- తీవ్ర మనస్తాపంతో మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
"జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదు... అదొక దురదృష్టకరమైన యాక్సిడెంట్. మేం ఒక మంచి సినిమా అందించాలని శ్రమించాం... థియేటర్ వాళ్లు కూడా ఒక మంచి సినిమా వేయాలని తాపత్రయపడ్డారు... పోలీసులు కూడా శక్తిమేర రక్షణ కల్పించాలని కృషి చేశారు... అయినప్పటికీ కూడా ఆ ఘటన జరిగింది. అందుకు ఎవరూ బాధ్యులు కారు. ఆ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఎవరి నియంత్రణలో లేవు. ఆ కుటుంబానికి జరిగింది తీరని నష్టం. అందుకు వారికి సంతాపం తెలియజేసుకుంటున్నాను.
సినీ రంగానికి చెందిన వ్యక్తిగా నా జీవిత లక్ష్యమే... థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టయిన్ చేయడం. థియేటర్ వచ్చిన జనాలను నవ్వుతూ పంపించాలన్నదే నా ఉద్దేశం. ప్రేక్షకుల మనసులను గెలిచి, సంతోషంగా పంపించాలని భావించే వ్యక్తిని. థియేటర్ ను ఒక ఆలయంలా భావించే వ్యక్తిని నేను... అలాంటి థియేటర్ లో ఘటన జరిగిందంటే నాకంటే బాధపడే వ్యక్తి మరొకరు ఉంటారా? చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతి గంటకు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను.
ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం... చాలావరకు తప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం అందకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంగా నేను ఏ రాజకీయ నేతను, ఏ ప్రభుత్వ విభాగాన్ని, ఇంకెవరినీ కూడా తప్పుబట్టడంలేదు. థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు... బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని ప్రభుత్వ పరంగా కూడా మేం సంతోషంగా ఉన్నాం.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు... నేను ఇలా ప్రవర్తించాను, నేను అలా అన్నాను అని చాలా తప్పుడు ఆరోపణలు వచ్చాయి... వాటిపై వివరణ ఇవ్వాలన్నదే నా ప్రయత్నం. నాపై ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరం. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా... నేను అలా మాట్లాడగలనా?
నేను నటించిన సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది... కానీ ఆ సినిమాకు సంబంధించి సెలబ్రేషన్స్ లోనూ నేను పాల్గొనలేకపోతున్నాను, కనీసం నా ఆఫీసుకు కూడా వెళ్లలేకపోతున్నాను. ఈ సమయంలో ఎలా ఉండాలి, కానీ పరిస్థితి ఎలా మారిపోయింది అని ఇంట్లోనే కూర్చుని విపరీతంగా బాధపడుతున్నాను.
మూడేళ్లు కష్టపడి తీసిన సినిమాను నేను ఇంతవరకు థియేటర్లో చూడలేదు. నేను నటించిన సినిమాలు థియేటర్ లో చూడడం నాకు అత్యంత ప్రధానమైన విషయం. ఈ సినిమా ఎలా తీశాం... రాబోయే సినిమాలు ఎలా తీయాలి అనేది నేను థియేటర్లోనే నేర్చుకుంటాను. తొక్కిసలాట జరిగితే నేను అలా మాట్లాడానంట... కాళ్లు చేతులు విరిగినా ఫర్వాలేదు అన్నానంట... ఇలా మీడియా ముందు నా మీద విపరీత ఆరోపణలు చేస్తుంటే నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నట్టే భావించాలి.
తెలుగుజాతిని ఎంతో ఉన్నతంగా నిలపాలన్న ప్రయత్నంతో చేసిన సినిమా అది. అందుకోసం మూడేళ్లు కష్టపడ్టాం. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. జరిగిన విషయాలన్నీ వరుసగా చెబుతాను. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు థియేటర్ లో చూస్తేనే, అది ఎలా వచ్చిందో అర్థమవుతుంది. అందుకే ఆ రోజున పుష్ప-2 చూసేందుకు వచ్చాను.
గత 20, 30 ఏళ్లుగా నేను అదే థియేటర్ కు వెళుతున్నాను. నా సినిమాలకే కాదు, ఇతర హీరోల సినిమాలకు కూడా వెళుతుంటాను. అటువంటిది... నేను బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించానని, అనుమతి లేకుండా వెళ్లాననేది పూర్తిగా అసత్యం. థియేటర్ వాళ్లు అనుమతి తెచ్చుకున్నారన్న కారణంతోనే మేం అక్కడికి వెళ్లాం. మేం వెళ్లేసరికి అక్కడ పోలీసులు జనాన్ని నియంత్రిస్తున్నారు. నేను వాళ్ల డైరెక్షన్ లోనే ముందుకు వెళ్లాను.
ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే... సార్, పర్మిషన్ లేదు అని వాళ్లే (పోలీసులు) చెబుతారు... కానీ అక్కడ పోలీసులే జనాన్ని కంట్రోల్ చేస్తుంటే, పర్మిషన్ ఉందనుకుని ముందుకు వెళ్లాను. అక్కడ ఊరేగింపు జరిగినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అక్కడ రోడ్ షో కానీ, ఊరేగింపు కానీ జరగలేదు. థియేటర్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో కారు ఆగిపోయింది. అక్కడ విపరీతమైన జనం ఉన్నారు. మనం ఒక్కసారి వారికి కనిపిస్తే కానీ వాళ్లు వెళ్లరు.
పోలీసులు కానీ, బౌన్సర్లు కానీ... సార్ మీరు ఒక్కసారి వాళ్లకు చేయి ఊపండి సార్ వెళ్లిపోతారు అని చెబుతుంటారు. దాంతో మేం కారులోంచి బయటికి వచ్చి చేయి ఊపుతుంటాం... నేనే కాదు, ఏ నేత అయినా, ఏ సెలబ్రిటీ అయినా ఇలాగే చేస్తారు. నా కోసం వేలమంది వచ్చినప్పుడు నేను కార్లోనే కూర్చుండిపోతే అహంకారి అనుకుంటారు. అందుకే, కారులోంచి బయటికి వచ్చి వారికి అభివాదం చేశాను. అక్కడ్నించి థియేటర్ లోపలికి వెళ్లాను.
థియేటర్ లోపల నాతో ఏ పోలీసు మాట్లాడలేదు, నాకు ఏ విషయం చెప్పలేదు. మేనేజ్ మెంట్ తరఫున వచ్చి నాకు చెప్పిందేమిటంటే... సర్... బయట అతి భారీగా జనం ఉన్నారు... పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది సర్... మీరు వెళ్లిపోండి అని చెప్పారు. దాంతో నేను థియేటర్ నుంచి వెళ్లిపోయాను. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే బయటికొచ్చేసి... అక్కడ్నించి వెళ్లిపోయాను.
తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, ఆమె బిడ్డను ఆసుపత్రిలో చేర్చారు అనే విషయాలు నాకు తర్వాతి రోజు తెలిశాయి. దాంతో నేను షాక్ అయ్యాను. ఆ రోజున థియేటర్ లో నా పిల్లలు కూడా నా పక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది అని తెలిస్తే పిల్లలను వదిలేసి నేను ఒక్కడ్నే వెళ్లిపోతానా? జనం ఎక్కువగా ఉన్నారన్న సమాచారంతోనే అక్కడ్నించి వెళ్లిపోయాను.
మహిళ మృతి చెందిన విషయం తర్వాతి రోజు తెలియగానే వెంటనే బన్నీ వాసుకు ఫోన్ చేసి, నేను ఆసుపత్రికి వెళ్లి వాళ్లను పరామర్శిస్తాను అని చెప్పాను. మీరు ఇప్పుడే వద్దు... అక్కడ వాళ్లు ఎమోషనల్ గా ఎలా ఉన్నారో చూసుకుని, ఆ తర్వాత మీరు వస్తే బాగుంటుంది... ముందు నేను వెళ్లొస్తాను అని బన్నీ వాసు అన్నాడు. ఆసుపత్రికి వెళ్లిన బన్నీ వాసుకు ఫోన్ చేస్తే... సార్ మీరు ఇప్పుడు ఇక్కడికి రావొద్దు... రాత్రి మీరు థియేటర్ కు వెళ్లినందుకే జరిగిందని అంటున్నారు... ఇప్పుడు మీరు ఆసుపత్రికి వస్తే మళ్లీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో... అంత్యక్రియలు పూర్తయ్యాక వాళ్లను నేనే మీ వద్దకు తీసుకువస్తాను అన్నాడు. ఈ సమయంలో బాధితుల వద్దకు వెళ్లడం సరికాదని మా న్యాయబృందం కూడా చెప్పడంతో నేను ఆగిపోయాను.
చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ గారి అభిమానులు చావుబతుకుల్లో ఉన్నారని తెలిస్తే నేను వెళ్లి వారికి సహాయం చేస్తుంటాను. ఓసారి విజయవాడ వెళ్లాను, ఓసారి వైజాగ్ వెళ్లాను... అలాంటిది నా సొంత అభిమానులకు ఇలా జరిగితే కలవకుండా ఎలా ఉండగలను? కానీ న్యాయపరంగా అది కుదరదు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది.
నేను కూడా ఆ ఘటనపై షాక్ లో ఉన్నాను. అటు బాధితుల వద్దకు వెళ్లకుండా, ఇటు ఏమీ మాట్లాడకుండా ఉంటే బాగుండదన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. డబ్బు ఇస్తానని ప్రకటించడం అనేది... నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పడమే నా ఉద్దేశం. ఓ కుటుంబం ఇంత బాధలో ఉంటే మనం విజయోత్సవాలు ఎలా చేసుకుంటాం అని భావించి అన్ని వేడుకలు రద్దు చేసుకున్నాం. దాంతో మా నాన్ననో, మా మామయ్యనో బాధితుల వద్దకు పంపించాలని నిర్ణయించుకున్నాం.
ఇంత బాధాకరమైన ఘటన జరిగినప్పుడు మనం ఏం చేద్దాం అని సుకుమార్ తో కూడా చర్చించాను. నేను, నువ్వు, మైత్రీ మూవీస్ సంస్థ ఒక పెద్ద మొత్తం ఆ అబ్బాయి పేర ఫిక్స్ డ్ చేద్దామా అని మాట్లాడుకున్నాం. ఆ అబ్బాయికి ఫిజియోథెరపిస్ట్ ను కూడా ఏర్పాటు చేద్దామనుకున్నాం. ఆ అబ్బాయి వయసంత పిల్లవాడు నాక్కూడా ఉన్నాడు. ఓ తండ్రిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఏదేమైనా ఆ రోజు జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం" అని అల్లు అర్జున్ తన మనోభావాలను మీడియా ఎదుట పంచుకున్నారు.