విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన వాయుగుండం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • విశాఖకు 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందంటున్న ఐఎండీ అమరావతి
  • విశాఖకు చేరువగా వచ్చే అవకాశముందంటున్న కొన్ని వెదర్ మోడల్స్ 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశలో 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ...  దాని తీవ్రతను అనుసరించి తదుపరి 12 గంటల పాటు వాయుగుండంగానే కొనసాగుతుందని, ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడుతుందని వివరించింది. 

కాగా, కొన్ని వెదర్ మోడల్స్ పేర్కొన్న ప్రకారం.... బలహీనపడిన అనంతరం ఇది విశాఖ తీరానికి చేరువగా వస్తుందని, ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.


More Telugu News