ఢిల్లీలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ లో లంచ్ చేసిన రాహుల్ అండ్ ఫ్యామిలీ... ఫొటోలు ఇవిగో!
- ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్ లో దర్శనమిచ్చిన రాహుల్ గాంధీ తదితరులు
- అందరూ ఒకే టేబుల్ వద్ద కూర్చుని లంచ్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు
రాజకీయ నేతల జీవితాలు ఎంత బిజీగా ఉంటాయో తెలిసిందే. ఇంట్లో అందరూ రాజకీయ నేతలే అయితే ఇక చెప్పనక్కర్లేదు. అందరూ కలిసి ఆస్వాదించే క్షణాలు ఎప్పుడో గానీ రావు. లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు రాహుల్ ఫ్యామిలీలో తాజాగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఎంపీ అయ్యారు.
ఈ నేపథ్యంలో, తాజాగా రాహుల్ కుటుంబ సభ్యులందరూ ఢిల్లీలోని ప్రఖ్యాత క్వాలిటీ రెస్టారెంట్లో లంచ్ చేశారు. దీని తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరాయా, ప్రియాంక అత్తగారు... అందరూ ఒకే టేబుల్ వద్ద కూర్చుని లంచ్ ఎంజాయ్ చేస్తుండడాన్ని ఈ ఫొటోలో చూడొచ్చు.