సంధ్య థియేటర్ ఘటన.. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసుల వార్నింగ్
- ప్రజలను అపోహలకు గురి చేసేలా పోస్టులు పెడుతున్నారన్న పోలీసులు
- అల్లు అర్జున్ రాకముందే తొక్కసలాట జరిగిందని పోస్టులు పెట్టారని ఆగ్రహం
- పోలీసు శాఖను బద్నాం చేసేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలను అపోహలకు గురి చేసేలా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు పోస్టులు పెట్టిన అంశం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్టుల పెడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించవచ్చని తెలిపారు.