అస్సలు తగ్గేదే లేదంటున్న పుష్ప-2 కలెక్షన్లు.. 20 రోజుల్లో ఎంతకు చేరాయంటే?

  • డిసెంబర్ 24 నాటికి సినిమా విడుదలై 20 రోజులు పూర్తి
  • గురువారం దేశవ్యాప్తంగా రూ.14.25 కొట్లగొట్టిన పుష్ప-2
  • రూ.1,075.60 కోట్లకు చేరిన దేశీయ కలెక్షన్లు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళుతూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. గురువారం (డిసెంబర్ 24) నాటికి ఈ సినిమా విడుదలై 20 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ హిందీలో ఈ మూవీ కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు.  20వ రోజైన గురువారం ఈ సినిమా రూ.14.25 కోట్లు వసూలు చేసిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ పేర్కొంది.

అత్యధికంగా హిందీలో రూ.11.5 కోట్లు కొల్లగొట్టింది. ఓరిజినల్ వెర్షన్ తెలుగు, ఇతర వెర్షన్లలో వసూళ్లు నెమ్మదించినప్పటికీ హిందీ రాష్ట్రాల్లో వసూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం నాటికి దేశవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1075.60 కోట్లకు పెరిగాయి. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగవచ్చనే సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఇతర సినిమాల పోటీని కూడా తట్టుకొని పుష్ప-2 నిలబడుతుండడం విశేషం.

కాగా, పుష్ప-2 కలెక్షన్లు దేశవ్యాప్తంగా రూ.700 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు దాటేసిన విషయం తెలిసిందే.


More Telugu News