జపాన్ ఎయిర్‌లైన్స్ పై సైబర్ దాడి
- పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ విమానాలపై ప్రభావం
- నిలిచిపోయిన టికెట్ల విక్రయాలు
- అసౌకర్యానికి క్షమాపణలు చెప్పిన జెఏఎల్
జపాన్ ఎయిర్ లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. గురువారం (26వ తేదీ) విమాన టికెట్ల విక్రయాలను కూడా విమానయాన సంస్థ నిలిపివేసింది. విమానయాన సంస్థ బ్యాగేజీ చెక్ ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తెలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ దాడిని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జపాన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొంది. గురువారం బయలుదేరే జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టికెట్ల విక్రయాలు నిలిపివేయడం జరిగిందని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెఏఎల్ క్షమాపణలు చెప్పింది.
కాగా, జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్)కు అల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ఏఎన్ఏ) తర్వాత దేశంలో రెండవ అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు ఉంది.