ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్

  • షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు
  • తనపై అక్రమ కేసులు పెట్టారని, ధర్మం గెలిచిందన్న ఎర్రోళ్ల శ్రీనివాస్
  • కోర్టు నిబంధనలు పాటిస్తానన్న బీఆర్ఎస్ నేత
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ రిమాండ్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... తనపై అక్ర‌మ కేసులు పెట్టిన ప్ర‌భుత్వంపై ధ‌ర్మమే గెలిచిందన్నారు. కోర్టు నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా పాటిస్తానన్నారు. ఇలాంటి సమయంలో తనకు అండ‌గా నిలిచిన కేటీఆర్, హరీశ్ రావు, పార్టీ శ్రేణులకు ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనుక్ష‌ణం ఈ కేసు వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలిస్తూ, బెయిల్ కోసం కృషి చేసిన పార్టీ లీగ‌ల్ టీమ్‌కు ఆయన ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.


More Telugu News