మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: జీవన్ రెడ్డి

  • దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కితాబు
  • ఏక మొత్తంలో రైతుల రుణాలను మాఫీ చేశారని ప్రశంస
  • మన్మోహన్ ను గౌరవించడం అంటే.. పీవీని గౌరవించడమేనని వ్యాఖ్య
దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని కితాబిచ్చారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, ఆధార్ కార్డు తెచ్చింది ఆయనేనని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ పూర్తి కావడం కూడా ఆయన ఘనతేనని చెప్పారు. 

తెలంగాణకు విద్యుత్ కేటాయింపుల్లో కూడా మన్మోహన్ సూచనలే ఎక్కువగా ఉన్నాయని జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐటీ ఖ్యాతిని పెంచారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ను గౌరవించడం అంటే... పీవీ నరసింహారావును గౌరవించడమేనని అన్నారు. మన్మోహన్ సేవలను గుర్తించింది పీవీ అని చెప్పారు.


More Telugu News