ఆసీస్ కుర్ర ఆటగాడి సెలబ్రేషన్ కు బుమ్రా కౌంటర్... వీడియో ఇదిగో!
- రంజుగా సాగుతున్న టీమిండియా, ఆసీస్ నాలుగో టెస్టు
- కోహ్లీ, కొన్ స్టాస్ మధ్య వివాదం
- కొన్ స్టాస్ ను బలంగా డీకొట్టిన కోహ్లీ
- కోహ్లీ అవుటైనప్పుడు సంబరాలు చేసుకున్న కొన్ స్టాస్
- కొన్ స్టాస్ ను బౌల్డ్ చేసిన అచ్చం అలాగే సంబరాలు చేసిన బుమ్రా
మెల్బోర్న్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు అత్యంత ఆసక్తికరంగా జరుగుతోంది. కాగా, ఈ టెస్టు తొలిరోజున టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ... ఆసీస్ కుర్ర ఓపెనర్ సామ్ కొన్ స్టాస్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
కొన్ స్టాస్ ను కోహ్లీ బలంగా ఢీకొట్టడం లైవ్ లో కనిపించింది. దాంతో ఇద్దరి మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత... కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చి అవుటైనప్పుడు కొన్ స్టాస్ సంబరాలు చేసుకున్నాడు. ఇంకా గట్టిగా అరవండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సంజ్ఞలు చేశాడు. ఈ విషయాన్ని టీమిండియా ఆటగాళ్లు బాగానే గుర్తుపెట్టుకున్నారు.
కొన్ స్టాస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో బుమ్రా.... కోహ్లీ అవుటైనప్పుడు కొన్ స్టాస్ ఎలా చేశాడో, తాను కూడా అలాగే చేశాడు. బుమ్రాను చూసి మిగతా టీమిండియా ఆటగాళ్లు కూడా అలాగే చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.