తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

  • 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన అధికారుల బదిలీ
  • కామారెడ్డి ఏఎస్పీగా చైతన్యరెడ్డి నియామకం
  • జనగామ ఏఎస్పీగా నియమితులైన చేతన్ నితిన్
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన అధికారులను బదిలీ చేసింది. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఎస్. చిత్తరంజన్ నియమితులయ్యారు.

కామారెడ్డి ఏఎస్పీగా చైతన్యరెడ్డి, జనగామ ఏఎస్పీగా చేతన్ నితిన్, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్, నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా, దేవరకొండ ఏఎస్పీగా మౌనిక, భువనగిరి ఏఎస్పీగా రాహుల్ రెడ్డి నియమితులయ్యారు.


More Telugu News