ఎస్సీ హాస్టల్లో నిద్ర... హైస్కూల్లో విద్యార్థులతో కలిసి యాదాద్రి జిల్లా కలెక్టర్ భోజనం

  • రాయగిరిలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్
  • నిన్న రాత్రి ఎస్సీ హాస్టల్లో బస చేసిన కలెక్టర్ హనుమంతరావు
  • విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు పెడుతున్న భోజనం బాగుందన్నారు. మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీ సభ్యురాలు కవితను అభినందించారు.

కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు. రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న హనుమంతరావు... కిచెన్‌తో పాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడే బస చేశారు.


More Telugu News