నూతన సంవత్సరాది జరుపుకొనే తొలి దేశం ఇదే... ఇంత‌కీ నూత‌న సంవ‌త్స‌ర ఘడియలు ఏ దేశంలో ఎప్పుడు?

  • భారత కాల‌మానం ప్ర‌కారం ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కే కిరిబాటిలో కొత్త ఏడాది ప్ర‌వేశం
  • పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం కిరిబాటి 
  • ఆ త‌ర్వాత టోంగా, స‌మోవా, ఫిజీ దీవుల్లో ఒకేసారి నూత‌న‌ సంవత్సరం వేడుకలు
  • కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా
  • కొత్త ఏడాది చివర‌గా పలకరించేది బేకర్, హౌలాండ్ దీవులను
  • ఇక్క‌డ రేపు సాయంత్రం 5.30 గంట‌ల‌కు కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు
మ‌రికొన్ని గంటల్లో ఈ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. నూత‌న‌ ఏడాదికి స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సిద్ధమ‌య్యాయి. అయితే, టైమ్ జోన్ ప్ర‌కారం ప్ర‌పంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల ప్ర‌జ‌లు ఇప్ప‌టికే కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లికారు. 

భారత కాల‌మానం ప్ర‌కారం ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని కిరిబాటి దీవుల్లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు ప్రారంభమయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం కిరిబాటి. కిరిబాటిలో అర్ధరాత్రి 12 గంటలైతే... భారత్‌లో మధ్యాహ్నం  గం.3.30 అవుతుంది. ఆ త‌ర్వాత ఒక గంట వ్య‌వ‌ధిలోనే ద‌క్షిణ‌ ప‌సిఫిక్ లోని టోంగా, స‌మోవా, ఫిజీ దీవుల్లో ఒకేసారి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. 

పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు అన్నింటి కంటే ముందుగా ఇలా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో మొద‌ట భానుడి కిరణాలు ఆ దేశాల మీద ప‌డటమే దీనికి కారణం. 

ఇక కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. కివీస్‌లోని అక్లాండ్‌, వెల్లింగ్ట‌న్ తో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా న‌గ‌రాలు మొద‌ట నూత‌న సంవ‌త్స‌రానికి వెల్‌కమ్ చెబుతాయి. 

కాగా, కొత్త సంవత్సరం చివర‌గా పలకరించేది బేకర్, హౌలాండ్ దీవులు. ఇక్క‌డ భార‌త కాల‌మానం ప్ర‌కారం రేపు సాయంత్రం 5.30 గంట‌ల‌కు కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు జ‌రుగుతాయి. భూగోళం అంచుల్లో ఉండే ద్వీప దేశాలివి. 


More Telugu News