యూఏఈలో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి డాక్టర్ మృతి

  • తేలికపాటి విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి
  • ఒకరు భారత్‌కు చెందిన సులేమాన్ ఆల్ మజిద్, మరొకరు పాక్ యువతి
  • కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన సమయంలో ప్రమాదం
యూఏఈలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వైద్యుడు మృతి చెందారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు ఓ తేలికపాటి విమానం కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిలో భారత్‌కు చెందిన సులేమాన్ ఆల్ మజిద్ ఉన్నారు. అతను పాకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువతితో (పైలట్) తేలికపాటి విమానంలో విహారానికి వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.

సులేమాన్ తన కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లాడు. పైలట్ అయిన పాక్ యువతితో కలిసి విమానంలో ఎక్కాడు. అతని సోదరుడు, తల్లిదండ్రులు ఏవియేషన్ క్లబ్ నుంచి వీక్షిస్తున్నారు. అంతలోనే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో సులేమాన్, పాక్ యువతి ఇద్దరూ మృతి చెందారు.


More Telugu News