నితీశ్ కుమార్ రెడ్డిపై గవాస్కర్ ప్రశంసలు

  • ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన టీమిండియా ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
  • కేరీర్ మొదట్లో హార్ధిక్ కంటే నితీశ్ మెరుగుగా కనిపించాడన్న గవాస్కర్
  • జట్టులో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడంలో నితీశ్ సక్సెస్ అయ్యాడన్న గవాస్కర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ సాధించడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. నితీశ్‌కు టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో జట్టు గెలవలేకపోయింది. 

నితీశ్ ఆట తీరుపై గవాస్కర్ స్పందిస్తూ.. ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో రోజురోజుకూ రాణించాడని అన్నారు. మెల్‌బోర్న్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. హార్దిక్ టెస్ట్ క్రికెట్‌కు దూరమైన నాటి నుంచి మీడియం పేస్‌లో బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కోసం భారత్ ఎదురుచూస్తోందని అన్నారు. నితీశ్ బౌలింగ్ పురోగమిస్తుందన్నారు. కెరీర్‌ మొదట్లో హార్ధిక్ కంటే నితీశ్ మెరుగ్గా కనిపించాడని చెప్పారు. 

ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ ఇప్పటి వరకు 294 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.   


More Telugu News