2025ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

  • 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.26 శాతం లాభపడ్డ మారుతి షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిని లాభాలతో ప్రారంభించాయి. ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను లాభాల దిశగా నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 368 పాయింట్లు లాభపడి 78,507కి చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,742 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.45%), బజాజ్ ఫైనాన్స్ (1.69%), ఎల్ అండ్ టీ (1.64%), టాటా మోటార్స్ (1.15%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.98%), అదానీ పోర్ట్స్ (-0.80%), జొమాటో (-0.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.21%).


More Telugu News