బోర్డు చైర్మన్ హోదాలో జలమండలి అధికారులతో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
- 2050 నాటికి నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
- గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించిన సీఎం
- మంజీరా పైప్ లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్ లైన్ నిర్మించాలని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. బోర్డు చైర్మన్ హోదాలో ఆయన తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. 2050 నాటికి నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మంజీరా పైప్ లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్ లైన్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.