రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: దాడి ఘటనపై కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఆగ్రహం

  • బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, రాజాసింగ్
  • బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద తిరగలేరని హెచ్చరిక
  • పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ రాళ్లు విసిరారని ఆగ్రహం
బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద తిరగలేరని హెచ్చరించారు.

పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారని, పోలీసుల తీరు ఇలా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు. 

ప్రజాస్వామ్యంలో హింస, భౌతిక దాడులకు తావులేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.


More Telugu News