సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు... బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

  • విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు
  • హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న ప్రజలు
  • విజయవాడలో బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు భారీగా తరలివస్తున్న ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో, ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి తెలుగు వారు కుటుంబాలతో సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఏపీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. 

విజయవాడలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. నగరంలోని నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోస్తా జిల్లాలకు, ఉత్తరాంధ్రకు వెళ్లేవారు ఎక్కువమంది ఉండడంతో అధికారులు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. 

విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని అధికారులు తెలిపారు. అటు, ప్రయాణికుల తాకిడితో రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.


More Telugu News