డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో పాట పాడిన బాలయ్య... వీడియో ఇదిగో!!

  • అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవం 
  • పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించిన బాలయ్య
  • కేరింతలతో ఊగిపోయిన అభిమానులు 
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చిత్రంలోని పాటలు ప్రేక్షకులు, అభిమానులను ఉర్రూతలూగించాయి. చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో చిత్ర బృందం వరుసగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 

తాజాగా అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ చిత్రంలోని పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


More Telugu News