దిల్ రాజును ఆయ‌న ఆఫీస్‌కి తీసుకెళ్లిన ఐటీ అధికారులు

 
టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌ దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఆయ‌న నివాసంలో ప‌లు కీల‌క ప‌త్రాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంత‌రం ఐటీ అధికారులు దిల్ రాజును సాగ‌ర్ సొసైటీలోని ఆయ‌న నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ (ఎస్‌వీసీ) కార్యాల‌యానికి త‌మ వెంట తీసుకెళ్లారు. అక్క‌డ మ‌ళ్లీ త‌నిఖీలు లేదా ప‌లు అంశాల‌పై దిల్ రాజును ప్ర‌శ్నించనున్న‌ట్లు స‌మాచారం.     


More Telugu News