ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌.. నాగ్‌పూర్ చేరుకున్న టీమిండియా ఆట‌గాళ్లు.. ఇదిగో వీడియో!

  • ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా
  • ఇప్పుడు మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌పై క‌న్నేసిన భార‌త్‌
  • ఈనెల 6న నాగ్‌పూర్ వేదిక‌గా తొలి వ‌న్డే
  • ఈ మ్యాచ్ కోసం ఆదివారం రాత్రి నాగ్‌పూర్ చేరుకున్న భార‌త జ‌ట్టు
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు జ‌రుగుతున్న ఈ సిరీస్‌ ఇంగ్లండ్‌, భార‌త్‌కు కీల‌కం
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌పై దృష్టిసారించింది. ఈనెల 6న (గురువారం) నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగే తొలి వ‌న్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు ఆదివారం రాత్రి నాగ్‌పూర్ చేరుకుంది. 

స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైస్వాల్ స‌హా ప‌లువురు ప్లేయ‌ర్లు నాగ్‌పూర్ విమానాశ్ర‌యంలో దిగి నేరుగా వారు బ‌స చేస్తున్న హోట‌ల్‌కు వెళ్లారు. ఈరోజు నుంచి వీరంతా ప్రాక్టీస్ చేయ‌నున్నారు. 

కాగా, మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మొద‌టి వ‌న్డే 6న‌ నాగ్‌పూర్‌లో జ‌రిగితే.. రెండో వ‌న్డే 9న క‌టక్‌, మూడో వ‌న్డే 12న అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇక భార‌త స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మొద‌టి రెండు వ‌న్డేల‌లో బ‌రిలోకి దిగ‌డు. మూడో వ‌న్డేలో అత‌డు ఆడే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ వర్గాలు వెల్ల‌డించాయి. అత‌ని స్థానంలో హ‌ర్షిత్ రాణా ఆడ‌నున్నాడు. 

ఇక కీల‌క‌మైన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు జ‌రుగుతున్న ఈ సిరీస్‌ ఇంగ్లండ్‌, భార‌త్‌కు మంచి ప్రాక్టీస్‌గా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

మూడు వ‌న్డేల సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ , అర్ష్‌దీప్‌ సింగ్ , యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా.


More Telugu News