ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్ర‌మాణస్వీకారానికి హాజ‌రైన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

  • ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్ర‌మాణం
  • ఆమెతో పాటు ప‌లువురు మంత్రులుగా ప్ర‌మాణం 
  • ఈ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ ను అప్యాయంగా ప‌ల‌క‌రించిన మోదీ
ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ప్ర‌మాణం చేయించారు. ఆమెతో పాటు ప‌లువురు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు ఏపీ నుంచి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ ను ప్ర‌ధాని మోదీ అప్యాయంగా ప‌ల‌కరించారు. ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ న‌వ్వులు పూయించారు. కాగా, ఇటీవ‌ల వెలువ‌డిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో క‌మ‌లం పార్టీ బంప‌ర్ మెజారిటీతో గెలిచిన విష‌యం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను బీజేపీ 48 స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. అటు ఆప్ కేవ‌లం 22 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా పాతింది.  


More Telugu News