కావాలంటే జగన్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పిస్తా: బీటెక్ రవి

  • పులివెందుల ప్రజలపై జగన్ కు ప్రేమ లేదన్న బీటెక్ రవి
  • పులివెందుల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా జగన్ పై ఉందని వ్యాఖ్య
  • పులివెందులకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కామెంట్ 
ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి ఓట్లు వేస్తూ గెలిపిస్తున్న పులివెందుల ప్రజలంటే వైసీపీ అధినేత జగన్ కు ఏమాత్రం ప్రేమ లేదని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శించారు. పులివెందులలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా జగన్ కు ఉందని చెప్పారు. 

పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని రవి అన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఉప ఎన్నికల్లో జగన్ నిలబడ్డా గెలిచే అవకాశం లేదని అన్నారు.


More Telugu News