టాస్ ఓడిపోవడంలో టీమిండియా పేరిట‌ కొనసాగుతున్న అవాంఛిత‌ రికార్డు

  • దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీస్ పోరు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 
  • వరుసగా 14 సార్లు టాస్ ఓడిన జ‌ట్టుగా భార‌త్ పేరిట చెత్త‌ రికార్డు
  • 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 14 సార్లు టాస్ ఓడిన వైనం
  •  నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డు (11)ను గతంలోనే అధిగ‌మించిన టీమిండియా  
వ‌న్డేల్లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో(14) టాస్ ఓడిన జ‌ట్టుగా భార‌త్ పేరిట అవాంఛిత రికార్డు కొనసాగుతోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ ఓడ‌టంతో ఈ రికార్డు మరింత పెరిగింది. భార‌త జ‌ట్టు 2023 న‌వంబ‌ర్ 19న జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 14 సార్లు టాస్ గెల‌వ‌లేక‌పోయింది. ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత 2024 ఆగ‌స్టులో శ్రీలంక‌తో ఆడిన మూడు వ‌న్డేల సిరీస్ లోనూ భార‌త్ ది అదే ప‌రిస్థితి. 

ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇంగ్లండ్ తో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ ఓడిపోయాడు. ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీ మూడు లీగ్ మ్యాచ్‌ల‌లోనూ భార‌త్ టాస్ ఓడింది. ఈరోజు మ్యాచ్ లోనూ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ టాస్ గెల‌వ‌లేక‌పోయాడు. ఇలా 2023 న‌వంబ‌ర్ 19 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 14 సార్లు టాస్ ఓడింది. టీమిండియా ఇప్పటికే నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డు (11)ను అధిగ‌మించింది. మార్చి 2011 నుంచి ఆగ‌స్టు 2013 మ‌ధ్య నెద‌ర్లాండ్స్ వ‌రుస‌గా 11 మ్యాచ్ ల్లో టాస్ ఓడింది. 


More Telugu News