రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఊహగానాలపై శుభ్‌మన్ గిల్ స్పందన ఇలా

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్లపై సోషల్ మీడియాలో పుకార్లు
  • పుకార్లపై భిన్నంగా స్పందించిన టీమిండియా వైస్ కెప్టెన్ గిల్
  • డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు రిటైర్మెంట్ల గురించి చర్చకే రాలేదని వెల్లడి
ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్‌పై పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. టోర్నీ అనంతరం ఈ ఇద్దరూ లేదా వీరిలో ఒకరైనా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని పలు ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ ఊహగానాలపై టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భిన్నంగా స్పందించారు.

న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు రిటైర్మెంట్ల గురించి చర్చకే రాలేదని అన్నారు. ఉత్తమ బ్యాటింగ్ లైనప్‌లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా బ్యాటింగ్‌లో డెప్త్ ఉన్నందువల్ల మొదటి మూడు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుందన్నారు. రోహిత్ శర్మ ప్రపంచంలోనే ఉత్తమ ఓపెనర్ అని, ఇక విరాట్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

తామంతా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కోసం ఉత్సాహంగా ఉన్నామని గిల్ పేర్కొన్నారు. గతంలో తాము వన్డే వరల్డ్ కప్ గెలుచుకోలేకపోయామని, కానీ ఈసారి అలా జరగనివ్వమన్నారు. 


More Telugu News