రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. 'ఆర్‌సీ 16' ఫ‌స్ట్ లుక్‌ వ‌చ్చేసింది!

  • రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో 'ఆర్‌సీ 16' 
  • ఈరోజు చెర్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
  • ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేక‌ర్స్‌
  • గుబురు గ‌డ్డం, పొడ‌వాటి జ‌ట్టుతో చ‌ర‌ణ్ ఊర‌మాస్ లుక్ అదుర్స్‌
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ఆర్‌సీ 16. ఈరోజు చెర్రీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఫ‌స్ట్‌లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అలాగే ముందు అనుకున్న‌ట్టే ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 

'పెద్ది' ఫ‌స్ట్‌లుక్ సింప్లీ సూప‌ర్బ్‌గా ఉంది. గుబురు గ‌డ్డం, పొడ‌వాటి జ‌ట్టుతో చ‌ర‌ణ్ ఊర‌మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టారు. ఈ చిత్రంలో చెర్రీ ప‌క్క‌న హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా... శివ‌రాజ్ కుమార్, బాలీవుడ్ న‌టుడు దివ్యేందు, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 


More Telugu News