హెచ్‌సీయూ వ్యవహారంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

  • హెచ్‌సీయూ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సరైనది కాదన్న కేసీఆర్
  • హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలన్న మాజీ సీఎం
  • హెచ్‌సీయూ అంశం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని ఆగ్రహం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు స్పందించారు. హెచ్‌సీయూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్‌సీయూ విద్యార్థులకు, వారికి అండగా నిలిచిన పార్టీలకు బీఆర్ఎస్ అధినేత అభినందనలు తెలిపారు.

హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దితే, దానిని నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠను ఈ ప్రభుత్వం దిగజార్చిందని అన్నారు. హెచ్‌సీయూ అంశం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను మరింత దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News