టీటీడీ అన్న‌దానానికి ప‌వ‌న్ అర్ధాంగి భారీ విరాళం

  • ఇవాళ‌ తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్న అన్నా లెజినోవా
  • వేకువ‌జామున శ్రీవారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్న ప‌వ‌న్ అర్ధాంగి
  • వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో మ‌ధ్యాహ్నం భోజ‌నానికి రూ. 17ల‌క్ష‌లు విత‌ర‌ణ‌
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా ఇవాళ‌ తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. వేకువ‌జామున స్వామివారి సుప్ర‌భాత సేవ‌లో ఆమె పాల్గొన్నారు. ద‌ర్శ‌నం అనంతరం అన్నాకు అర్చ‌కులు శ్రీవారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. 

త‌మ కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్‌ ఇటీవ‌ల సింగ‌పూర్‌లోని పాఠ‌శాల‌లో జ‌రిగిన‌ అగ్ని ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆమె స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. త‌మ కుమారుడు కోలుకోవ‌డంతో తిరుమ‌లలో మార్క్ శంక‌ర్ పేరు మీద ఈరోజు అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఇందుకోసం మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో మ‌ధ్యాహ్నం భోజ‌నానికి రూ. 17ల‌క్ష‌లు విత‌ర‌ణ చేశారు.   




More Telugu News