రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

  • ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం
  • వాంఖడే మైదానంలో ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని నిర్ణయం
  • ఐపీఎల్ 18వ సీజన్ సందర్భంలో సన్ రైజర్స్‌తో మ్యాచ్ సమయంలోనే రోహిత్ పెవిలియన్‌ను ఆవిష్కరించే ఛాన్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎంసీఏ ప్రతినిధులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్‌తో జరిగే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ పెవిలియన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌కు క్రికెట్ దిగ్గజాల పేర్లు పెట్టే అంశంపై అధికారులు చర్చించారు.

భారత జట్టుకు, ముంబయి క్రికెట్‌కు విశేషమైన సేవలందించిన రోహిత్ శర్మను గౌరవించాలని భావించిన వారంతా వాంఖడేలోని ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని తీర్మానించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ వెల్లడించారు. 


More Telugu News