రేపు ఏపీ టెన్త్ ఫ‌లితాలు

  
ఏపీ ప‌దో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్‌ 23న) ఉద‌యం విడుదల చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ పరీక్ష‌ల విభాగం డైరెక్ట‌ర్ శ్రీనివాసులు రెడ్డి వెల్ల‌డించారు. టెన్త్ రెగ్యుల‌ర్‌తో పాటు సార్వ‌త్రిక విద్యాపీఠం ప‌ది, ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.  

ఇక‌, ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్‌ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్ర‌భుత్వ‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు.

దీనికోసం ముందుగా ఈ నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్‌ పంపించాలి. వెంటనే మీకు సర్వీసెస్ ఎంపిక చేసుకోమని వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే పదో తరగతి ఫలితాల లింక్ కన్పిస్తుంది. ఇది క్లిక్ చేసి మీ పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫ‌లితాలు పీడీఎఫ్ రూపంలో వ‌స్తాయి. 


More Telugu News