తన సినిమా స్పెషల్ షోకు హాజరుకాని ఆమిర్ ఖాన్.. కారణం ఇదేే!
- 1994 నాటి క్లాసిక్ 'అందాజ్ అప్నా అప్నా' రీరిలీజ్
- సినిమా కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు
- ఈ స్పెషల్ షోకు హాజరుకాని ఆమిర్ ఖాన్
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ తన పాత క్లాసిక్ చిత్రం 'అందాజ్ అప్నా అప్నా' 1994లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్, ఈరోజు థియేటర్లలో రీరిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు, క్రూ సిబ్బందికి ప్రత్యేక షో వేశారు. అయితే ఆమిర్ ఖాన్ రాకపోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన ఈ షోకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సినిమా వివరాల్లోకి వెళితే, దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అందాజ్ అప్నా అప్నా' చిత్రం అప్పట్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, కరిష్మా కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. హాస్యనటులు పరేష్ రావల్, శక్తి కపూర్ తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.