ఉగ్రదాడిలో జనసేన క్రియాశీలక సభ్యుడు మరణించడం బాధాకరం: నాదెండ్ల మనోహర్
- ఏలూరు పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించిన జనసేన
- ఉగ్రదాడిలో మధూసూధన్ మరణించడం బాధాకరమని వ్యాఖ్య
- ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపు
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించామని చెప్పారు. ఈ దాడిలో జనసేన క్రియాశీల సభ్యుడు మధుసూధన్ మరణించడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అందరం కలిసి ముందుకు సాగాలని చెప్పారు. మన దేశం, మన రాష్ట్రం తర్వాతే మనందరం అని అన్నారు. దేశం కోసం, సమాజం కోసం అందరం కలిసి నిలడదామని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ... కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపడం దిగ్భ్రాంతికరమని చెప్పారు. తీవ్రవాదాన్ని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ... కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపడం దిగ్భ్రాంతికరమని చెప్పారు. తీవ్రవాదాన్ని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.