అరుణాచల యాత్రకు ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. వివరాలు ఇవిగో!

  • ప్రతీ గురువారం కాచిగూడ నుంచి రైలు
  • 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగే యాత్ర
  • ఈ నెల 19 నుంచి అందుబాటులో టికెట్లు
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవాలని చూస్తున్న భక్తుల కోసం ఇండియన్ రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ లో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు పుదుచ్చేరిలోని పకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. ప్రతీ గురువారం కాచిగూడ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుందని, 4 రాత్రులు, 5 పగళ్లు యాత్ర కొనసాగుతుందని వెల్లడించింది. జూన్‌ 19 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

సాయంత్రం 5 గంటలకు యాత్ర షురూ..
  • గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 
  • రెండో రోజు.. ఉదయం 11 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకొని అరోవిల్‌, అరబిందో ఆశ్రమం, బీచ్‌ సందర్శన. రాత్రి పుదుచ్చేరిలోనే బస.
  • మూడో రోజు.. ఉదయం టిఫెన్ చేసి తిరువణ్ణామలై చేరుకుంటారు. హోటల్ లో స్వల్ప విశ్రాంతి తర్వాత అరుణాచలేశ్వరుడి దర్శనం.. రాత్రి అక్కడే బస
  • నాలుగో రోజు.. ఉదయం టిఫిన్ చేసి కాంచీపురానికి బయల్దేరుతారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయ సందర్శన. ఆ తర్వాత చెంగల్పట్టు స్టేషన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:35 గంటలకు తిరుగు ప్రయాణం.
  • ఐదో రోజు.. ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.

ఛార్జీలు (ఒక్కరికి) థర్డ్ ఏసీలో..
  • ట్విన్ షేరింగ్ కు రూ.20,060, ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,610
  • పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) విత్ బెడ్ రూ.11,750, వితౌట్ బెడ్ రూ.9,950

స్లీపర్‌ క్లాస్ లో..
  • ట్విన్‌ షేరింగ్‌కు రూ.17,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,460. 
  • పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) విత్ బెడ్‌తో రూ.9,590, అదే వితౌట్ బెడ్ రూ.7,800
(గమనిక: బృందంగా వెళ్లే వారు గ్రూప్ బుకింగ్ చేసుకుంటే ఐఆర్ సీటీసీ రాయితీ ఇస్తోంది)

ప్యాకేజీలో లభించే సదుపాయాలు..
  • ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం, స్థానికంగా ప్రయాణానికి వాహనం ఏర్పాటు
  • రెండు రోజుల బస, ఉదయం టిఫిన్‌ బాధ్యత ఐఆర్‌సీటీసీదే. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం
  • ఐఆర్‌సీటీసీ పాలసీ ప్రకారం.. క్యాన్సిలేషన్‌ ఛార్జీలు వర్తిస్తాయి. మరింత సమాచారం, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ను సందర్శించండి.


More Telugu News