బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

  • సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో నమోదైన కేసు కొట్టివేత
  • 2021 ఎమ్మెల్సీ ఎన్నికల ర్యాలీకి సంబంధించిన ఘటన
  • అనుమతి లేని కాన్వాయ్‌పై ఎన్నికల అధికారి ఫిర్యాదు
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన ఒక కేసును ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి ఈ కేసు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, సదరు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News