వైసీపీ నేత కాకాణిపై మరో కేసు... రిమాండ్ విధించిన కోర్టు

  • కృష్ణపట్నం పోర్టు వద్ద అక్రమ టోల్‌గేట్ వసూళ్లపై కేసు
  • జులై 3 వరకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు 
  • పీటీ వారెంట్‌పై కాకాణిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో కేసులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నెల్లూరు రైల్వే కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఆయనపై ఫిర్యాదు నమోదైంది.

ఈరోజు పీటీ వారెంట్‌పై పోలీసులు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఆయనకు జులై 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాజీ మంత్రి కాకాణి ఇప్పటికే మూడు వేర్వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తాజా కేసుతో ఆయనపై ఉన్న కేసుల సంఖ్య మరింత పెరిగింది. 


More Telugu News