చిరంజీవికి పాదాభివందనం చేసిన ధనుష్.. వీడియో ఇదిగో

  • కుబేర మూవీ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
  • చిరంజీవిని చూడగానే పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్న ధనుష్
  • ధనుష్‌ను ఆలింగనం చేసుకుని అభినందించిన చిరంజీవి
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో, విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం జూన్ 20న విడుదలైంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుష్ ఆడిటోరియానికి రాగానే చిత్ర బృందాన్ని పలకరిస్తూ, మెగాస్టార్ చిరంజీవిని చూడగానే ఆయనకు పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే, ధనుష్ పాదాభివందనం చేస్తుండగా చిరంజీవి వారిస్తూ పైకి లేపి ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



More Telugu News