ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ ఫైర్

  • ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందన్న రాహుల్ గాంధీ
  • వారికి రాజ్యాంగం వద్దు. మనుస్మృతి కావాలని మండిపడ్డ రాహుల్
  • రాజ్యాంగ పీఠిక వివాదంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలను కొనసాగించడంపై సమీక్ష జరగాలన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని, వారికి కావలసింది మనుస్మృతి మాత్రమేనని, భారత రాజ్యాంగం కాదని రాహుల్ ధ్వజమెత్తారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదం గురించి చెబుతున్న రాజ్యాంగం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు నచ్చదని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించి వారిని మళ్లీ బానిసలుగా చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు.

రాజ్యాంగం వంటి శక్తిమంతమైన ఆయుధాన్ని వారి నుంచి లాక్కోవడం వారి నిజమైన ఎజెండా అని, ఆర్ఎస్ఎస్ ఇలాంటి కలలు కనడం మానేయాలని, తాము వారిని ఎప్పటికీ విజయవంతం కానివ్వమని రాహుల్ స్పష్టం చేశారు. 


More Telugu News