మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ ‘కోర’ టీజర్

యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా  ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కోర మీద అంచనాలు పెంచేశాయి.

తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్‌లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్‌ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

తారాగణం: సునామీ కిట్టి , చరిష్మా , పి.మూర్తి , M.K మాత , మునిరాజు , నినాసం అశ్వత్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: ఒరాటశ్రీ
నిర్మాతలు: డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి
బ్యానర్లు: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్
కెమెరామెన్: సెల్వం మత్తప్పన్
సంగీత దర్శకుడు: బి ఆర్ హేమంత్ కుమార్
ఎడిటర్: కె.గిరీష్ కుమార్
విన్యాసాలు: కోరా చిన్నయ్య
మేకప్: ప్రదీప్
ఆర్ట్ డైరెక్టర్: జినేద్ర
PRO: సాయి సతీష్

     

More Press News