హైదరాబాద్ శివారులోని నానక్ రాంగూడలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ భవనంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ భవనంలో కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి భవనం పక్కనే ఉన్న నాలుగు కార్లు, ఓ లారీ ధ్వంసం కాగా, ఓ జేసీబీ సైతం ఎగిరిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించట్లేదు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.