యూనిఫామ్ సర్వీసులకు వయోపరిమితిని పెంచడంతో గ్రూప్ -1,2 ఉద్యోగ దరఖాస్తుల గడువును పెంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ -1,2 ఉద్యోగాలకు దరఖాస్తు కోరిన విషయం తెలిసిందే. నేడు ఈ దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీపీఎస్పీ ఓ ప్రకటన చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాలకు ఫిబ్రవరి 7 వరకూ గడువును పెంచగా.. గ్రూప్ -2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 10 వరకూ దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.