తమ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ రోజు చింతమనేని పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'తెలుగుదేశం పార్టీ నాయకులు, దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.