హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై అలేఖ్య అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిని ఓ కారు ఢీ కొట్టి ఆమెను 50 అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితురాలిని గుర్తించారు. అలేఖ్యను ఢీ కొట్టిన కారును ప్రణీత అనే మహిళ నడుపుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అలేఖ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఓ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి.