టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈరోజు 'చలో అమరావతి' పిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి 200 కార్లతో  అమరావతికి బయల్దేరారు. అంతకు ముందు అమరావతి బయల్దేరేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో, అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల కళ్లుగప్పి చింతమనేని అమరావతికి బయల్దేరడం విశేషం. మరోవైపు, మార్గమధ్యంలో ఆయనను ఎక్కడైనా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది.