Twitter: ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డులోకి ఎలాన్ మస్క్
- ట్విట్టర్లో 9.2 శాతం వాటా కలిగిన మస్క్
- ఈ విషయం వెల్లడితో దూసుకుపోయిన ట్విట్టర్ షేర్
- తాజాగా మస్క్‌కు డైరెక్టర్ల బోర్డులోకి ట్విట్టర్ ఆహ్వానం
వాణిజ్య రంగంలో మంగళవారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్... సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డులోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సంస్థను ఉటంకిస్తూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ద అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
ట్విట్టర్లో ఎలాన్ మస్క్ 9.2 శాతం షేర్లను కొనుగోలు చేసినట్లుగా సోమవారం ఓ వార్త వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటపడటంతో ట్విట్టర్ షేర్ ధర ఒక్కరోజులోనే 26 శాతం మేర పెరిగిన విషయమూ విదితమే. తాజాగా తమ సంస్థలో 9 శాతానికి పైగా వాటా కలిగిన ఎలాన్ మస్క్‌కు తమ డైరెక్టర్ల బోర్డులో చోటు కల్పించనున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.