Pilot Rohit Reddy: పబ్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హంగామా... వీడియో పంచుకున్న తీన్మార్ మల్లన్న

Tandur MLA Pilot Rohit Reddy spotted at a pub
  • పబ్ లో మద్యం పొంగించిన పైలెట్ రోహిత్ రెడ్డి
  • ఇతరులకు మద్యం తాగిస్తూ హుషారుగా కనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • తాండూరు ప్రజల ఆశాజ్యోతి అంటూ తీన్మార్ మల్లన్న వ్యంగ్యం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఓ పబ్ లో హంగామా చేసిన దృశ్యాలతో కూడిన వీడియో తెరపైకి వచ్చింది. మద్యం పొంగిస్తూ, ఇతరులకు తాగిస్తూ ఈ తాండూరు ఎమ్మెల్యే ఎంతో హుషారుగా కనిపించారు. ఈ సంబరాల్లో కొందరు అమ్మాయిలు కూడా దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాండూరు ప్రజల ఆశాజ్యోతి... గౌరవ శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి లలిత కళలు అంటూ మల్లన్న వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా, సోషల్ మీడియాలో పైలెట్ రోహిత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Pilot Rohit Reddy
Pub
Video
Teenmar Mallanna
BRS
Tandur
Telangana

More Telugu News