cough syrup: మాయదారి దగ్గు ముందు కంపెనీకి మళ్లీ అనుమతులు
- మారియన్ బయోటెక్ లో తయారీకి యూపీ అనుమతి
- దగ్గు ముందు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీకీ ఆమోదం
- ఈ కంపెనీ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్థాన్ లో 65 మంది చిన్నారుల మరణం
ఉజ్బెకిస్థాన్ లో 65 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమైన భారత ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ ఉదంతం గుర్తుండే ఉంటుంది. మారియన్ తయారు చేసిన దగ్గు మందులో హానికారకాలు అధిక పరిమాణంలో ఉన్నట్టు, వీటి కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఉజ్బెకిస్థాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం తర్వాత మారియన్ బయోటెక్ ప్లాంట్ లో తయారీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ యూపీ సర్కారు ఆదేశించింది.