బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాప్ సింగర్ రిహన్నా సహా ఎంతోమంది తమ ప్రదర్శనలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. 

నిన్న జరిగిన వేడుకల్లో నీతా అంబానీ ఇచ్చిన సంప్రదాయ నృత్య ప్రదర్శన చూసి ఆహూతులు మైమరచిపోయారు. ‘విశ్వంభర స్తుతి’కి ఆమె ఇచ్చిన ప్రదర్శన ‘ఔరా’ అనిపించింది. విశ్వంభర శృతి అనేది దుర్గాదేవిని స్తుతిస్తూ ఆలపించే పాట. నీతా తన ప్రదర్శనను తన మనవరాళ్లు ఆదియా శక్తి, వేద సహా మహిళా శక్తి స్వరూపాలైన యువతులకు అంకితమిచ్చారు.