హీరో యశ్‌ తన కొత్త సినిమా ‘టాక్సిక్’ ఆలస్యంపై నోరు విప్పారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. అందుకే విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. గీతూ మోహన్ దాస్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

టాక్సిక్ సినిమా జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్‌ను మరింత పెద్దగా మార్చాలని నిర్ణయించారు. దీనివల్ల అభిమానులు నిరాశ చెందుతారని యశ్‌ అంగీకరించారు. భారత్‌లో షూటింగ్ మొదలవగానే విడుదలపై అంచనాలు ఉంటాయని అన్నారు. కానీ తన విజన్ మాత్రం చాలా పెద్దదని చెప్పారు.

భారత్‌లో సినిమా ప్రకటించగానే మార్కెటింగ్ మొదలవుతుందని యశ్‌ అన్నారు. కానీ హాలీవుడ్‌లో సినిమా పూర్తయ్యాకే వ్యాపారం జరుగుతుందని చెప్పారు. అక్కడ పెట్టుబడిదారులు మొత్తం సినిమా చూశాకే నిర్ణయం తీసుకుంటారన్నారు. టాక్సిక్ సినిమాను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అందుకే కొంచెం సమయం పడుతుందని, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరారు.